June 7, 2026
Explore
మీ పేరు మీద పాత బండి ఉందా?.. ఆర్టీఓ రికార్డులు మార్చుకోండి!

మీ పేరు మీద పాత బండి ఉందా?.. ఆర్టీఓ రికార్డులు మార్చుకోండి!

June 7, 2026 | Andhra Pradesh

అన్నమయ్యజిల్లా ముచ్చట్లు:

వాహనాలు అమ్మేసినా రికార్డుల్లో పేరు మారకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయని అన్నమయ్య జిల్లా డీటీఓ అశోక్ ప్రతాపరావు తెలిపారు. ఒకవేళ ఇప్పటికీ మీ పేరు మీదనే పాత బండి చూపిస్తుంటే వెంటనే సచివాలయానికి వెళ్లి మార్చుకోవాలని సూచించారు. ఆర్టీఓ రికార్డుల్లో ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ లేదా క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా తల్లికి వందనం, రైస్ కార్డ్ వంటి పథకాల కోసం సచివాలయాన్ని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

Tags: Do you have an old vehicle registered in your name? Update your RTO records!