June 6, 2026
Explore
కుక్క విశ్వాసం అంటే ఇదే.. కుక్క విశ్వాసాన్ని నిరూపించే నిదర్శనమే ఈ చిత్రం

కుక్క విశ్వాసం అంటే ఇదే.. కుక్క విశ్వాసాన్ని నిరూపించే నిదర్శనమే ఈ చిత్రం

June 6, 2026 | Andhra Pradesh

ఖాజీపేట ముచ్చట్లు:

జంతువుల్లో కుక్క విశ్వాసానికి మారుపేరు.. కడుపు నింపిన యజమానిపట్ల అది ఎంతో విశ్వాసంగా ఉంటుంది.. కడుపు నింపే కుటుంబానికి రక్షణ,అండగా ఉంటుంది.. ఆస్తులు, అంతస్తులు, పరువు, ప్రతిష్ట అన్ని ఇచ్చిన అయిన వారినీ పట్టించుకోని ఈ రోజుల్లో అన్నం పెట్టిన విశ్వాసానికి కుక్క చూపించే ప్రేమ వెలకట్టలేనిది..

ఖాజీపేట మండలం దుంపల గట్టు సమీపంలో నిన్న నీటి కుంటలో పడి మృతి చెందిన యువతుల మృతదేహాలను తీసుకొస్తున్న క్రమంలో తమ యజమాని చనిపోయాడు అన్న బాధను విశ్వాసం గల కుక్క ఎలా ప్రదర్శిస్తుందో ఈ చిత్రము లో మనం చూడవచ్చు.. మూగ జీవి ప్రేమ అది.. యువతులు పందులతో పాటు కుక్కను కూడా పెంచుకుంటూ దానికి అన్నం పెట్టే వారు.. అన్నం పెట్టిన తమ యజమాని చనిపోవడం తో ఒళ్లంతా కళ్ళు చేసుకొనీ చూస్తున్న శునకం చూపులు మనసు ను కలుక్కుమనేలా చేస్తాయి.

Tags: This is what canine loyalty is all about… this image is a testament to a dog’s loyalty.