రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణం మెప్మా (MEPMA) కార్యాలయంలో మహిళలకు చట్టాలు, రక్షణ యాప్‌లపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మహిళా పోలీస్ స్టేషన్ సిఐ, రాయచోటి టౌన్ ఎస్ఐ హాజరై మహిళలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.మహిళల రక్షణ కోసం రూపొందించిన ‘శక్తి యాప్’ ఉపయోగాలు, మహిళల పట్ల జరుగుతున్న నేరాల నివారణ, పోక్సో (POCSO) చట్టాలపై వారు క్షుణ్ణంగా వివరించారు. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు 112, 181, 1098, 1930 లపై అవగాహన కల్పించారు. వీటితో పాటు ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు మరియు మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి, మహిళలు, తల్లిదండ్రులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
Tags: Awareness Seminar on Women’s Safety and Social Issues