పుంగనూరుముచ్చట్లు:
పాఠశాలల్లో 1వ తరగతి బోదిస్తున్న ఉపాధ్యాయులకు ఈనెల 9 వరకు ఎఫ్‌ఎల్‌ఎన్ ఫౌండేషన్ లీటర్సి అండ్ న్యూమర్సి శిక్షణా తరగతులు ప్రారంభించినట్లు ఎంఈవో నటరాజారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక బసవరాజ ప్రభుత్వ హైస్కూల్‌లో శిక్షణ తరగతులను ఎంఈవో -2 రెడ్డెన్నశెట్టితో కలసి ప్రారంభించారు. ఎంఈవో మాట్లాడుతూ జిల్లాలోని 12 మంది రిసోర్స్పర్సన్లచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకంపై కూడ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు మెరుగైన బోదన పద్దతులను వివరించి, వాటిని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణకు పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం మండలాలకు చెందిన ఉపాధ్యాయులతో పాటు రీసోర్స్పర్సన్లు శోభ, రుద్రాణి, రెడ్డెమ్మ , సీఆర్‌పిలు తదితరులు పాల్గొన్నారు.


Tags: Training for teachers until the 9th