బాధ్యతలు స్వీకరణ….
–పుష్ప గుచ్చంతో సాదర స్వాగతం పలికిన ఆర్. ఐ. బాలసుబ్రమణ్యం…కార్యాలయ సిబ్బంది.
మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో 15 మండలాలకు తహసీల్దార్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో భాగంగా కలెక్టర్ వారికి మండలాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో రామాపురం మండలానికి ఎస్. వెంకటేశులు, కలెక్టర్ కు కె.భువనేశ్వరి దేవి, జ్ఞానేంద్రప్రసాద్, బి.కొత్తకోటకు అగ్రహారం బావాజాన్, ఎల్.ఆర్ పల్లెకు క్రాంతికుమార్, చిన్నమండ్యంకు నంద్యాల రామాంజనేయులు, గుర్రంకొండకు లక్ష్మీప్రసన్న, నిమ్మనపల్లెకు తపస్విని, రామసముద్రం మహమ్మద్ అజరుద్దీన్, వాల్మీకిపురం పాములేటి, రాయచోటి యామిని, పెద్దమండ్యంకు తేజస్వి, మదనపల్లెకు మాధవి, కలెక్టరేట్లోని భూసేకరణ విభాగానికి పీరున్ని, ములకలచెరువుకు రెడెన్నను నియమించారు.
ఇప్పటికే ఆయా మండలాల్లో అడాక్ లేదా ఎఫ్ఎసీగా కొనసాగుతున్న తహసీల్దార్లు కొత్తగా నియామకాలు చేపట్టిన వారికి బాధ్యతలు అప్పగిం చాలని సూచించారు
అలాగే ఆయా స్థానాల్లో వెంటనే బాధ్యతలు చేపట్టాలని, లేకుంటే పోస్టింగ్ రద్దయ్యే అవకాశం ఉందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
మరో వైపు బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్లు చార్జ్ లిస్టుతో సహా తమకు నివేదిక పంపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు
Tags: Madhavi appointed as the new Tahsildar of Madanapalle.