June 5, 2026
Explore
పర్యావరణ కాలుష్య నివారణలో భాగస్వాములుకావాలి

పర్యావరణ కాలుష్య నివారణలో భాగస్వాములుకావాలి

June 5, 2026 | Andhra Pradesh

సబ్‌కలెక్టర్‌ చల్లా కళ్యాణి

పుంగనూరుముచ్చట్లు:

పర్యావరణ కాలుష్యాన్ని నివారించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములుకావాలని మదనపల్లె సబ్‌కలెక్టర్‌, మున్సిపాలిటి స్పెషలాఫీసర్‌ చల్లా కళ్యాణి పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపాలిటిలో కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డితో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద వెహోక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మున్సిపాలిటిలో సచివాలయ ఉద్యోగులు, మెప్మా మహిళలతో సమావేశం నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటిలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పుంగనూరు తొలిస్థానంలో ఉందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అబినందనలు తెలిపారు. అలాగే 2016 లో ప్రతి ఇంటికి వెళ్లి మూడు రకాల చెత్తను సేకరించే వారమని , ప్రస్తుతం నాలుగు రకాల చెత్తను విడివిడిగా సేకరించాలని సూచించారు. ఈ చెత్తను శాయ పద్దతిలో నశింపు చేసి , చెత్తను వినియోగించడం, సంపదగా మార్చడం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు వెహోక్కలు నాటి సంరక్షించాలని కోరారు. మహిళలు ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత చేపట్టాలన్నారు. మున్సిపాలిటి సిరిజన్‌చార్ట్ ఫీడ్‌బ్యాక్‌ కార్యక్రమంలో రాష్ట్రంలోనే ముందంజలో ఉందని ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలు అన్నింటిని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్‌ రాము, ఎంపీడీవో అప్పాజి తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌పై జాగ్రత్త…

మున్సిపాలిటి పరిధిలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌లో కొన్ని తప్పులు జరుగుతోందని సబ్‌ కలెక్టర్‌ తెలిపారు. ఇలాంటివి జరగకుండ తక్షణమే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒక్క పొరపాటు జరిగిన దానిని సరిదిద్దేందుకు చాలా శ్రమించాల్సి వస్తుందని, ఈ విషయంలో బిఎల్‌వోలు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించి, పారదర్శకమైన జాబితాను రూపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈనెల 10న ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆమె తెలిపారు.

Tags: We must become partners in preventing environmental pollution.