June 5, 2026
Explore
దేవాదాయశాఖ వారి చర్యలను ఖండిస్తున్నాం

దేవాదాయశాఖ వారి చర్యలను ఖండిస్తున్నాం

June 5, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని పాతబస్టాండ్‌ వద్ద గల శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని దేవాదాయశాఖ వారు ఏకపక్షంగా స్వాధీనం చేసుకున్నారని, హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న అధికారులు వాటిని ఖాతరు చేస్తూ వేలంపాటలు నిర్వహిస్తున్నారని రాయల్‌ పీపుల్స్ ఫౌండర్‌ రెడ్డిశేఖర్‌రాయల్‌ మండిపడ్డారు. శుక్రవారం స్థానిక మారెమ్మ ఆలయంలో దేవాదాయశాఖ అధికారులు అమ్మవారి ఆలయంలో టెంకాయలు, గుమ్మిడికాయలు తదితర వస్తువుల విక్రయాల వేలంపాటలు నిర్వహించేందుకు ప్రకటన ఇచ్చారు. ఈ విషయం తెలుసుకుని ఆర్‌సిఎఫ్‌ సభ్యులు, ఆలయ ధర్మకర్తలు, వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ అధికారులు వేలం నిర్వహించకుండ వాయిదా వేశారు. ఈ సందర్భంగా రెడ్డిశేఖర్‌రాయల్‌ మాట్లాడుతూ దేవాదాయశాఖ అధికారులు తమ ఇష్టారాజ్యంగా చట్టాలను మారిస్తే తగిన పోరాటం చేస్తామన్నారు. బలిజ కులస్తులు నిర్మించి, అభివృద్ధి చేసుకున్న ఆలయాన్ని ఎలా దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంటారని నిలధీశారు. దేవాదాయశాఖ అక్రమాలపై త్వరలోనే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘ నాయకులు శ్రీనివాసులు, గోపిరాయల్‌, జనార్ధన్‌రాయల్‌, నానబాలమణి, విజయ్‌కుమార్‌, యుగంధర్‌, అఖిల్‌, నంద తదితరులు పాల్గొన్నారు.

Tags: We condemn the actions of the Endowments Department.