June 5, 2026
Explore
వైఎస్సార్‌సిపి నాయకులు , కార్యకర్తలపై అక్రమ కేసులు

వైఎస్సార్‌సిపి నాయకులు , కార్యకర్తలపై అక్రమ కేసులు

June 5, 2026 | Andhra Pradesh

మాజీ ఎంపీ రెడ్డెప్ప ఏ1 గా నమోదు

  • హద్దులు దాటుతున్న అధికార దుర్వినియోగం
  • 33 మందిపై కేసు నమోదు

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర వైఎస్సార్‌సిపి పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో సహా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పను తొలి నిందితుడిగా పేర్కొంటు పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గమైన పుంగనూరులో గురువారం పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను , బాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్లను తగులబెట్టే కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించారు. దీనిపై అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని హానీఫ్‌బాషా అనే పోలీస్‌ వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకుని జాతీయ రహదారిపై ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు చూపుతూ అక్రమ కేసులు 33 మందిపై నమోదు చేస్తూ ఎఫ్‌ఐఆర్‌ 142/2026గా నమోదు చేశారు. ఇందులో బిఎన్‌ఎస్‌ సెక్షన్లు 126,(2) , 196(1), 292,రెడ్‌విత్‌ 3,(5) గా నమోదు చేశారు. ఇందులో చిత్తూరు మాజీ ఎంపి రెడ్డెప్ప , మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మూడవ ముద్దాయి వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, నాల్గవ ముద్దాయిగా సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఐదవ ముద్దాయిగా ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి , రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి జయరామిరెడ్డి , జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, మాజీ ఎంపిపి నరసింహులు, పార్టీ పట్టణ , మండల కన్వీనర్లు ఇర్ఫాన్‌, అమరనాథరెడ్డి, మిధున్‌యువసేన అధ్యక్షుడు రాజేష్‌, మైనార్టీ ల నాయకుడు మమ్ము,తో పాటు 21 మందిపైన కేసు నమోదు చేశారు. దీనిపై మాజీ ఎంపి రెడ్డెప్ప మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సిపి క్యాడర్‌ ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. తెలుగుదేశం మోసాలను ప్రజలకు వివరించి , తగున గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు.

Tags: False cases against YSRCP leaders and activists.