June 5, 2026
Explore
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్

June 5, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా తరహా బీచ్ షాక్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ పాలసీ కింద విశాఖపట్నం, చీరాల బీచ్లలో తాత్కాలిక బీచ్ ఫ్రంట్ బార్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.

పర్యాటకులకు మద్యం, సీఫుడ్, స్నాక్స్ తదితర ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి.

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీటి నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు.

దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించి రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

Tags:Key decision by the AP government: Vizag Beach to become like Goa Beach.