June 5, 2026
Explore
రాయచోటికి నూతన తహసిల్దార్‌గా యామిని బాధ్యతల స్వీకరణ

రాయచోటికి నూతన తహసిల్దార్‌గా యామిని బాధ్యతల స్వీకరణ

June 5, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి మండల నూతన తహసిల్దార్‌గా జానపాటి యామిని బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆమె స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకమైన సేవలు అందిస్తానని తెలిపారు. నూతన తహసిల్దార్‌కు కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు, స్థానిక నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:Yamini assumes charge as the new Tahsildar of Rayachoti.