పుంగనూరుముచ్చట్లు:
మైనర్లు వాహనాలను నడపరాదని, ఒక వేళ అలా నిబంధనలు ఉల్లంఘిస్తే వారి తల్లిదండ్రులు శిక్షార్హులౌతారని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ హెచ్చరించారు. గురువారం ఆమె మాట్లాడుతూ మైనర్ పిల్లలు వాహనాలు నడపడం నేరమని , వారికి వాహనాలు అప్పగించిన వ్యక్తులు సైతం శిక్షకు గురికావాల్సి వస్తుందని తెలియజేశారు. మోటారు వాహన చట్టంలో సెక్షన్ 180, 181 క్రింద 18 ఏళ్ల లోపు వాహనం నడపరాదన్నారు. తల్లిదండ్రులు సైతం సరదా కోసం పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించరాదని హెచ్చరించారు. అలాగే రోడ్లపై అధికశాతం మైనర్లు వాహనాలు నడుపుతూ ఉండటాన్ని గమనిస్తున్నామన్నారు. త్వరలోనే పోలీస్‌శాఖ సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపడుతామని తెలిపారు. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని ఆమె తెలిపారు.
Tags; Parents will be punished if minors drive vehicles