ప్రొద్దుటూరు ముచ్చట్లు:
మెడికల్ షాపు నిర్వాహాకుడు బ్రహ్మయ్య పై బ్లాక్ మెయిల్ చేసిన గంజి నాగరాజు మరియు AK యూట్యూబ్ నిర్వాహకుడు శివరాం. ASP కి పిర్యాదు చేసిన బ్రహ్మయ్య తో పాటు ప్రొద్దుటూరు మెడికల్ షాపు అసోసియేషన్. యూట్యూబ్ లో ప్రసారం చేస్తే మెడికల్ షాపు కు మంచి పేరు పోతుందని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన గంజి నాగరాజు, AK యూట్యూబ్ శివరాం. 50 వేలు ఇస్తే వదులుతాం లేకుంటే మీ మెడికల్ షాపుపై తప్పుడు పిర్యాదు చేసి వేధిస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న గంజి నాగరాజు, AK యూట్యూబ్ శివరాం. ఇటీవల పోక్సో కేసులో రిమాండ్ పోయి బెయిల్ పై వచ్చిన గంజి నాగరాజు. గంజి నాగరాజు టంగుటూరు గ్రామానికి చెందిన వ్యక్తి. అనవసరంగా షాపు పేరు పోతుందని భయపడి పలుమార్లు డబ్బులు ఇచ్చిన గంజి నాగరాజు, శివరాం కు దాహం తీరలేదని బ్రహ్మయ్య మరియు మెడికల్ షాపు అసోసియేషన్. డబ్బులు ఇవ్వలేదని డ్రగ్ ఇన్స్పెక్టర్ కు పలుమార్లు ఫోన్ చేసి మెడికల్ షాపు మూపించాలని ఒత్తిడి చేసిన గంజి నాగరాజు. వీరిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు సమాచారం.బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు ప్రజలు పోలీస్ అధికారులను,ఎమ్మెల్యే ని కోరుతున్నారు.
Tags:Case Registered Against Ganji Nagaraju and Shivaram for Blackmail