చిత్తూరు ముచ్చట్లు:
సమాజంలో ఉన్న అన్ని అంశాలపై పల్లె పల్లెకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు.
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు, జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ రాజశేఖర్ గారి నేతృత్వంలో జిల్లా అంతటా పోలీసులు గ్రామాల నందు “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
గ్రామీణ ప్రాంత ప్రజల భద్రత, అవగాహన, పోలీసు–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.
పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా పోలీసులు ప్రజలకు “ధైర్య–స్పర్శ” కార్యక్రమం గురించి వివరిస్తూ పోలీసులే కాకుండా మీ ప్రాంతంలో అలాంటి ప్రదేశాలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులకు తెలియజేయవచ్చునని తెలిపారు. మహిళలు మరియు చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాల నివారణ, బాధితులు ఎదుర్కొనే పరిస్థితులు, ఫిర్యాదు చేసే విధానం, అలాగే తక్షణ సహాయం పొందే మార్గాలపై వివరించారు. సైబర్ క్రైమ్స్ విషయంలో సోషల్ మీడియా, ఆన్‌లైన్ లావాదేవీలలో జాగ్రత్తలు, మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, కుటుంబ పరమైన నష్టాలను వివరిస్తూ యువత మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన మరియు సామాజిక సమస్యలపై స్పష్టతనిస్తూ, చట్టబద్ధమైన వయస్సు అనంతరమే వివాహం జరగాలని ప్రజలకు తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
అదేవిధంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ, ఆధారాల సేకరణలో కలిగే ప్రయోజనాలను వివరించారు. పోలీసు–ప్రజల మధ్య నమ్మకం, సహకారం పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే నేరరహిత సమాజం సాధ్యమవుతుందని తెలియపరిచారు.
ప్రజల భాగస్వామ్యం, పోలీసుల నిరంతర కృషి ద్వారా గ్రామాలను మరింత సురక్షితంగా, శాంతియుతంగా మార్చడమే “పల్లెనిద్ర” కార్యక్రమం యొక్క ప్రధాన.
Tags:The district police have undertaken the “Pallenidra” (Village Night Stay) program throughout Chittoor district.