ఇంట్లోకి ఎలుక దూరితే.. ఇల్లు కాల్చేసినట్టు..
అమరావతిముచ్చట్లు:
దేశంలోనే తొలిసారిగా నీట్ యూజీ పరీక్ష కోసం భారత వాయుసేన దిగనుంది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో.. రద్దయిన పరీక్షను జూన్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. దాదాపుగా 22 లక్షలమంది ఈ పరీక్ష రాయనున్నారు. రీ-ఎగ్జామ్ నిర్వహణలో లాజిస్టిక్స్, ప్రశ్నాపత్రాల సురక్షిత రవాణా కోసం సైన్యం సహాయాన్ని తీసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్‌టీఏ (NTA) ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని..ప్రశ్నాపత్రాల తయారీ నుంచి ముద్రణ, రవాణా, భద్రతా ఏర్పాట్లు, చివరి దశ పంపిణీ వరకు మొత్తం పరీక్ష నిర్వహణ ప్రక్రియను సమీక్షించారు. లక్నో.. ఆగ్రా.. గోరఖ్ పూర్, వారణాసి, పాట్నా, దర్భాంగా.. కలకత్తా, తదితర ప్రాంతాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా పరీక్షా పత్రాలను పంపించి.. అక్కడి నుంచి అన్ని పరీక్షా కేంద్రాలకు పంపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Tags; Indian Air Force… for NEET Exams!