విశాఖపట్నం ముచ్చట్లు:
‘ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ బస్సు సేవ పథకం’ ద్వారా ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు.
ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక వసతులపై అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష.
2026 చివరి నాటికి ఈ-బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు.
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరుకు 100 బస్సుల చొప్పున.. అమరావతి, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, తిరుపతి, అనంతపురంకు 50 బస్సుల చొప్పున కేటాయింపు.
పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా లక్ష్యంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ముందడుగు.
: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Tags; Union Minister Pemmasani Chandrasekhar makes a key announcement!