.34 కోట్ల రూపాయలు విరాళాల రూపం లో అందించిన మలయాలీలు
సౌదీ అరేబియా ముచ్చట్లు:
సౌదీ అరేబియా జైల్లో 20 ఏళ్లపాటు శిక్ష అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్ స్వదేశానికి చేరుకున్నారు.
2006లో ఉపాధి కోసం సౌదీ వెళ్లిన రహీమ్, ఒక దివ్యాంగ బాలుడికి కేర్‌టేకర్‌గా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ బాలుడు మరణించాడు.
దీంతో రహీమ్‌పై కేసు నమోదైంది.
బాలుడి కుటుంబం క్షమాభిక్షకు నిరాకరించడంతో 2018లో ఆయనకు శిక్ష ఖరారైంది.
దాదాపు 34 కోట్ల రూపాయల క్షమాధనం చెల్లించాల్సి రాగా, ప్రపంచవ్యాప్త మలయాళీ సమాజం విరాళాల ద్వారా ఆ డబ్బును సేకరించి చెల్లించడంతో రహీమ్ విడుదలయ్యారు.
బుధవారం రాత్రి సౌదీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం ఉదయం కేరళలోని కరిపుర్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Tags: Reprieve from the Death Penalty…