May 29, 2026
Explore
గాలివాన బీభత్సం.. నలుగురు మృతి

గాలివాన బీభత్సం.. నలుగురు మృతి

May 29, 2026 | Andhra Pradesh

కృష్ణా జిల్లా ముచ్చట్లు:

కృష్ణా, గుంటూరు,పల్నాడు, విజయవాడలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది.

– కృష్ణా జిల్లా కుమ్మరపాలెంలో ఈదురు గాలులకు తాటి చెట్టు కూలడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు.

– కృష్ణా జిల్లా లంకపల్లిలో ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.

– గుంటూరులోని లక్ష్మీపురం, పొన్నూరు రోడ్డులో భారీ ఈదురుగాలులకు చెట్లు, హోర్డింగులు కూలిపోయాయి.

  • విద్యుత్ తీగలు తగిలి విజయవాడ టూటౌన్ హోంగార్డు జానీ మృతి చెందాడు.

Tags;Storm Wreaks Havoc: Four Dead