May 29, 2026
Explore
క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

May 29, 2026 | Andhra Pradesh

-హోరాహోరీగా పోటీలు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని సుగాలిమిట్టలో మిధున్‌ దళం క్రికెట్‌ టోర్నమెంట్‌ను రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. వైఎస్సార్‌సిపి జిల్లాయూత్‌వింగ్‌ కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో మిధున్‌దళం టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డికి క్రీడాకారులు , అభిమానులు , పార్టీ నాయకులు, లంబాడి మహిళలు ఘనస్వాగతం పలికారు. బాణసంచాలు పేల్చి టోర్నమెంట్‌ ప్రారంభించారు. పెద్దిరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని , క్రికెట్‌ ఆడి ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్దిరెడ్డి జిందాబాద్‌…మిధున్‌రెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రీడల్లో యువత పాల్గొనడం శుభపరిణామమన్నారు. క్రీడల్లో పాల్గొనే వారికి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి రెడ్డెప్ప, వైఎస్సార్‌సిపి ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బాణావత్‌ మునీంద్రనాయక్‌, పార్టీ నాయకులు భానుప్రసాద్‌, రాజేష్‌, సురేష్‌, ప్రశాంత్‌రెడ్డి, డాబా శ్రీనివాసులు, ఆంజినాయక్‌, శ్రీనివాసులునాయక్‌, వేణునాయక్‌, మోహన్‌నాయక్‌, బాబునాయక్‌, రాజునాయక్‌, రషీదబేగం తదితరులు పాల్గొన్నారు.

Tags: Former Minister Peddireddy Inaugurates Cricket Tournament