. చెన్నకేశవుడి పాదాల నుంచి రక్తం..!
తిరుపతి ముచ్చట్లు:
చిట్వేలు మండలంలోని నాగవరం గ్రామంలో 1228 నాటి పురాతన ఆలయం.. వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఒక అంతుచిక్కని వింత సంఘటన చోటుచేసుకుంది.
ఆలయ గర్భగుడిలోని స్వామి వారి పాదాల పీఠం భాగం నుండి ఎర్రటి వర్ణంతో కూడిన ఒక ద్రవం నిరంతరం బయటకు వస్తోంది.
ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
సాధారణంగా శిలా విగ్రహాల నుండి ఇలాంటి ద్రవాలు రావడం అత్యంత అరుదు.
బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం.. కలియుగం అంతమయ్యే ముందు దైవ విగ్రహాలు కన్నీరు పెడతాయని, రక్తం కారుస్తాయని చెప్పిన కొన్ని ఆనవాళ్లు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Tags: Will what Brahmamgaru predicted regarding the end of the Kali Yuga actually come true?