రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి మండలం మాధవరం గ్రామ సచివాలయ ప్రాంగణంలోని రైతు సేవా కేంద్రం శిలాఫలకాన్ని పగలగొట్టిన కేసులో వైఎస్సార్సీపీ యూత్ జనరల్ సెక్రటరీ షేక్ బిలవున్ భుట్టో అలియాస్ బిల్లాల్ (22)ను పోలీసులు అరెస్ట్ చేశారు.సచివాలయ స్థలంలో అక్రమంగా నిర్మించిన గొర్రెల దొడ్డిని గతంలో అధికారులు తొలగించడంతో, రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ కార్యకర్తలను ఇరికించేందుకు ముద్దాయి మే 25న వైఎస్సార్సీపీ కాలం నాటి శిలాఫలకాన్ని రాయితో పగలగొట్టాడు. అనంతరం ఆ ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి, టీడీపీ శ్రేణులే ఈ పని చేశారంటూ తప్పుడు ప్రచారం సాగించాడు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాయచోటి అర్బన్ ఇన్స్పెక్టర్ చలపతి, ఎస్ఐ విష్ణువర్ధన్ హెచ్చరించారు.
Tags: YSRCP Leader Who Smashed Government Plaque Arrested