May 28, 2026
Explore
మహానాడు మూడుముక్కలాట-చల్లాపై మధు ఆదిపత్యపోరు

మహానాడు మూడుముక్కలాట-చల్లాపై మధు ఆదిపత్యపోరు

May 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు మూడుముక్కలాటగా సాగింది. ప్రతి నియోజకవర్గంలోను మహానాడు ను హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహిస్తామని నారావారు వెల్లడించారు. కానీ తమ్ముళ్ళను మాత్రం ఏకతాటిపై నడిపించడంలో పార్టీ విఫలమైంది. నియోజకవర్గ నాయకుడు చల్లారామచంద్రారెడ్డికి , వ్యాపారవేత్త, కమ్మసామాజిక వర్గానికి చెందిన మధుసూదన్‌నాయుడు వర్గానికి గత రెండు సంవత్సరాలుగా ఆదిపత్యపు పోరు సాగుతోంది. ఇలా ఉండగా మహానాడులో తమ్ముళ్లు అందరు ఒకటిగా మహానాడును నిర్వహించాలని పార్టీ నిర్ధేశించింది. కానీ పుంగనూరులో మధుసూదన్‌నాయుడు వర్గం మాత్రం ఒక ప్రైవేటు హ్గటల్‌లో తమకు అనుకూలమైన నాయకులు, కార్యకర్తలచే మహానాడును నిర్వహించారు. చల్లావర్గం పట్టణంలోని ట్రావెలర్స్ బంగ్లాలో నిర్వహించారు. మరోవర్గం నాయకులు మాజీ కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు కలసి ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశాలకు ప్రజలు , పార్టీ క్యాడర్‌ ఆశించిన మేరకు రాకపోవడంతో డ్వాక్రా మహిళలను రప్పించి సమావేశాలు తూతూ మంత్రంగా నిర్వహించారు. కాగా తమ్ముళ్లు మూడు వర్గాలుగా విడిపోయి వీధికెక్కారు. గత మూడు నెలల క్రితం కమిటిల నియామకంలో బహిరంగంగా కొట్టుకున్న తమ్ముళ్లు ప్రస్తుతం గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారు సమావేశాలు నిర్వహించారు. అర్భన్‌, రూరల్‌తో పాటు వీటి రెండింటిలోను ఎక్కువ మందిని తన వర్గంలోకి చేర్చుకుని మదుసూదన్‌నాయుడు మహానాడులో ఏకపాత్రాభినయంతో వర్గపోరులో అగ్రస్థానంలో నిలిచి చల్లాపై బహిరంగ పోరుకు మధుసూదన్‌నాయుడు సిద్ధమైనట్లు స్పష్టమౌతోంది. మధుసూదన్‌నాయుడు ఒత్తిడితోనే పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ కమిటిలు, నామినేటెడ్‌ పదవులు సైతం చంద్రబాబునాయుడు పెండింగ్‌లో పెట్టినట్లు రుజువౌతోంది.

Tags:Mahanadu’s ‘Three-Card Monte’ — Madhu’s Power Struggle Against Challa