May 28, 2026
Explore
29న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన

29న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన

May 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర మాజీ మంత్రి , పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం మండలంలో పర్యటించనున్నారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మండలంలోని సుగాలిమిట్టలో జరిగే క్రికెట్‌ టోర్నమెంటులో ఎమ్మెల్యే పాల్గొంటారు. అలాగే సోమల మండలం వడ్డిపల్లెలో జరిగే మహాభారతయజ్ఞం కార్యక్రమంలో పాల్గొంటారు. సదుం మండల కేంద్రం జాండ్రపేటలో రామలింగేశ్వర చౌడేశ్వరిదేవి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఎమ్మెల్యే పర్యటనలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Tags: MLA Peddireddy’s Tour on the 29th