పుంగనూరుముచ్చట్లు:
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగను జరుపుకోవాలని చిత్తూరు మాజీ ఎంపి రెడ్డెప్ప తెలిపారు. గురువారం ఆయన బక్రీద్ సందర్భంగా పలువురు ముస్లింల ఇండ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల అభివృద్ధి వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలచే మాత్రమే సాధ్యమౌతుందని తెలిపారు. అన్నిపార్టీల నాయకులు ముస్లింలను వాడుకుంటారే తప్పా వారి అభివృద్ధికి ఎవరు దోహదం చేయలేదని రెడ్డెప్ప ఎద్దెవ చేశారు.
Tags; Former MP Reddeppa extends Bakrid greetings.