పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని బండ్లపల్లెలో నివాసం ఉన్న శ్రీనివాసులు(43) మనస్థాపానికి గురై గురువారం ఇంట్లోనే ఉరివేసుకు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసులు గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు శ్రీనివాసులను కాపాడేందుకు ప్రయత్నించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Individual Commits Suicide