May 28, 2026
Explore
భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

May 28, 2026 | Andhra Pradesh

పుంగ నూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోను ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో బక్రీద్‌ వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సంధర్భంగా చిత్తూరు మాజీ ఎంపి రెడ్డెప్ప ముస్లింలను కలసి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు ఉదయం నుంచి మసీదుల్లోను, ఈద్గాల వద్ద నమాజ్‌లు నిర్వహించారు. పుంగనూరు పట్టణం, పరిసర ప్రాంతాలలోని వేలాది మంది ముస్లింలు నూతన దుస్తులు ధరించి, పట్ణణ సమీపంలోని ఎన్‌ఎస్‌.పేటలో గల ఈద్గా వద్ద, అలాగే తోపుమఠంలో మహమ్మదాలి నిర్మించిన ఈద్గా వద్ద ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు. అక్కడ మతగురువులు అల్లాబోదనలు వినిపించారు. అక్కడి నుంచి నేరుగా స్మశాన వాటికలకు వెళ్లి మృతి చెందిన వారివారి కుటుంబ సభ్యులకు నివాళులర్పించారు. ముస్లింలు అల్లాహ్గ..అక్భర్‌ అంటు ప్రార్థనలు చేశారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా మసీదుల వద్ద , ఇండ్ల వద్ద పేదలకు నగదు, దుస్తులు, అన్నదానాలు నిర్వహించారు. హిందూముస్లింలందరు కలసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటు వింధు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు అలీమ్‌బాషా, అయూబ్‌ఖాన్‌, ఫకృద్ధిన్‌షరీఫ్‌, అమ్ము, ఎంఎస్‌.సలీం, కిజర్‌ఖాన్‌, ఖాదర్‌, సిద్ధిక్‌, ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:Bakrid celebrations observed with devotion and reverence.