మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె లో ఆపరేషన్ వికటించి రైతు మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. రొంపిచర్ల మండలం, వారణాసి పల్లికి చెందిన రైతు శ్రీనివాసులు నాయుడు (51) వీపుపై గడ్డ రావడంతో ఆపరేషన్ చేయించు కోవడానికి మదనపల్లికి వచ్చాడు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్ లో బుధవారం ఆపరేషన్ చేయించు కున్నాడు. ఆ ఆపరేషన్ వికటించడంతో రైతు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే మరో ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ లో ఉంచారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.
Tags: Farmer dies after operation goes wrong.