రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఒక విషాదకర సంఘటన వెలుగుచూసింది. లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ హుస్సేన్ (30) కడప సమీపంలోని రైల్వేట్రాక్‌పై శవమై కనిపించాడు. మృతుడి తల, మొండెం వేరువేరుగా పడి ఉండటాన్ని రైల్వే అధికారులు గుర్తించి, లక్కిరెడ్డిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక అతని మృతికి ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్న కోణంలో కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Tags: Youth from Lakkireddypalle dies after falling under a train in Kadapa.