కురుబలకోట ముచ్చట్లు:
కురుబలకోట మండలం ముదివేడులో ఓ దళిత మహిళపై మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. బాధితురాలైన లేట్ నరసప్ప భార్య బి.రాజమ్మ (50) కథనం మేరకు.. ఆమె తమ వీధి గుండా వెళ్తుండగా, అదే వీధికి చెందిన అఫ్సల్, హసీనా, షాహీన తదితరులు అడ్డుకున్నారు. తమ ఇళ్ల ముందు నుండి వెళ్లకూడదని వారు ఆంక్షలు విధించడంతో.. పూర్వీకుల నుంచి వస్తున్న దారిని కాదని ఎటు వెళ్లాలని రాజమ్మ ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన వారు ఆమెపై మూకుమ్మడిగా దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tags: Mob Attack on Dalit Woman