May 27, 2026
Explore
బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం – సబ్ కలెక్టర్ కల్యాణి

బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం – సబ్ కలెక్టర్ కల్యాణి

May 27, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు కోల్పోయిన బాధిత రైతులందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం అందజేస్తామని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి తెలిపారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఎన్‌హెచ్ అధికారులు, బికేపల్లి, బసినికొండ, వెంకప్పకోట గ్రామాల రైతులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు త్వరితగతిన న్యాయబద్ధమైన నష్టపరిహారం అందేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Tags: We will provide acceptable compensation to the victims — Sub-Collector Kalyani