May 27, 2026
Explore
కుష్ఠు, ఎయిడ్స్, టీబీ నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయాలి – డాక్టర్ రాధిక

కుష్ఠు, ఎయిడ్స్, టీబీ నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయాలి – డాక్టర్ రాధిక

May 27, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

కుష్ఠు, ఎయిడ్స్, టీబీ వంటి వ్యాధుల నియంత్రణకు వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నమయ్య జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్.రాధిక సూచించారు. బుధవారం రాయచోటిలోని సిబ్యాల సబ్ సెంటర్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని టీబీ, కుష్ఠు కేసుల రికార్డులు, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో డీఎం&హెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది సుధాకర్ రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags: We must work with sincerity to control leprosy, AIDS, and TB — Dr. Radhika.