అన్నమయ్య ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచామని, మొబైల్ పెట్రోలింగ్ ముమ్మరం చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రార్థనా స్థలాల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ బుధవారం సాయంత్రం వివరించారు.
Tags: Bakrid Celebrated Amidst Tight Security — SP