రామాపురం ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో జనాభా గణన-2026 ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం గాలివీడు, రామాపురం మండలాల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటింటికీ తిరిగి యాప్‌లో నమోదైన వివరాలను, రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గాలివీడులో 2,147 ఖాళీ, 55 తాళం వేసిన ఇళ్లు.. రామాపురంలో 1,620 ఖాళీ, 76 తాళం వేసిన ఇళ్లు ఉన్నట్లు తహశీల్దార్లు తెలిపారు. తాళం వేసిన గృహాలపై పునఃపరిశీలన జరిపి, లోపాలను 4 రోజుల్లోగా సవరించాలని అధికారులను ఆదేశించారు.
Tags; The Census Must Be Conducted Transparently – Collector