May 27, 2026
Explore
పెద్దిరెడ్డి , మిధున్‌రెడ్డిలతో జగన్‌ను కలిసిన అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి

పెద్దిరెడ్డి , మిధున్‌రెడ్డిలతో జగన్‌ను కలిసిన అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి

May 27, 2026 | Andhra Pradesh


-వివాహా వేడుకలకు ఆహ్వానం

  • 28న మదనపల్లెకు జగన్‌ రాక ఖాయం

పుంగనూరు ముచ్చట్లు:

మాజీ ముఖ్యమంత్రి , వైఎస్సార్‌సిపి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డితో కలసి మదనపల్లె నాయకులు అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి కలసి తాడేపల్లెలోని ఆయన నివాసంలో కలిశారు. జూన్‌ నెల 28న అనీషారెడ్డి దంపతుల కుమారుడు ఉజ్వలకృష్ణారెడ్డి వివాహా రిషెప్షన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు తప్పకుండ రావాలని అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డిలు జగన్‌ ను ఆహ్వానించారు. జగన్‌మోహన్‌రెడ్డి మదనపల్లెకు రావడం ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు జగనన్నకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయనున్నారు.

Tags: Anisha Reddy and Srinath Reddy met Jagan, accompanied by Peddireddy and Mithun Reddy.