పుంగనూరుముచ్చట్లు:
సివిల్ సప్లయిస్ గోదాములలో పని చేస్తున్న హమాలీలకు తక్షణమే వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వెంకట్రమణారెడ్డి , సీపీఐ కార్యదర్శి రామమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం వారు గోడౌనును పరిశీలించి హమాలీల సమస్యలపై చర్చించారు. వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం కష్టపడే హమాలీలకు వేతనాలు ఇవ్వకపోవడం బాధకరమన్నారు. నిత్యం బస్తాలు లోడింగ్, అన్‌లోడింగ్ చేసే హమాలీలకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే వారి కుటుంబ జీవనం కష్టతరమౌతుందన్నారు. హమాలీలకు ఇన్సూరెన్స్, పక్కాగృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో హమాలీలు పళణి, రెడ్డెప్ప, గంగాధర్, తిరుమల, సదాశివ తదితరులు పాల్గొన్నారు.
Tags; Wages must be paid to the porters.