పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించేందుకు వచ్చే ప్రయాణికుల కోసం వాటర్‌కూలర్‌ను బుధవారం విరాళంగా ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, సభ్యులు అమరావతి సురేష్, వేణుగోపాల్, జె.సురేష్‌లు కలసి వాటర్‌కూలర్‌ను కొనుగోలు చేసి డిపో మేనేజర్ దినేష్‌కు అందజేశారు. వేసవి తీవ్రంగా ఉండటంతో ప్రయాణికులు సేదతీరేందుకు వీలుగా వాటర్‌కూలర్‌ను బహుకరించినట్లు తెలిపారు. ఆర్యవైశ్య సంఘ నేతలను మేనేజర్ అభినందించారు.
Tags: Water Cooler Donated to RTC Passengers