May 27, 2026
Explore
తహశీల్ధార్‌, ఆర్‌ఐ రాలేదని దళితుల ధర్నా

తహశీల్ధార్‌, ఆర్‌ఐ రాలేదని దళితుల ధర్నా

May 27, 2026 | Andhra Pradesh

మానటరింగ్‌ కమిటి అంటే లెక్కలేదు

  • కలెక్టర్‌ చర్యలు తీసుకోకుంటే అర్ధనగ్నప్రదర్శన

పుంగనూరుముచ్చట్లు:

ప్రతినెల జరిగే ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్‌ మానటరింగ్‌ కమిటి సమావేశానికి తహశీల్ధార్‌, ఆర్‌ఐతో పాటు 27 శాఖల అధికారులు రాకపోవడంతో దళిత నేతలు ధర్నా చేసి , నిరసన తెలిపారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్‌ మానటరింగ్‌ కమిటి సమావేశం నిర్వహించారు. అధికారులు రాకపోవడం, తహశీల్ధార్‌ , ఆర్‌ఐ కూడ రాకుండ దళితులను అవమానపరుస్తున్నారని దళిత సంఘాల ప్రతినిదులు అశోక్‌, నరసింహులు, శంకరప్ప, చెన్నరాయుడు లు మండిపడ్డారు. నామమాత్రపు సమావేశాలు ఎందుకంటు బహిష్కరించి , తహశీల్ధార్‌ కార్యాలయం ముందు బైఠాయించి, నినాదాలు చేశారు. అశోక్‌ మాట్లాడుతూ 27 శాఖల అధికారులు రాకపోవడం బాధకరమన్నారు. ప్రతి నెల ఇలాగే సాగిస్తున్నారని , దళితులన్న వారి సమస్యలన్న అధికారులకు నిర్లక్షం అన్నారు. ఈ విషయమై నోటీసులు జారీ చేయాల్సిన తహశీల్ధార్‌, ఆర్‌ఐ కూడ దళితులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని , లేకపోతే దళితులు అర్ధనగ్నప్రదర్శనలతో ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో నేతలు పెంచుపల్లి కృష్ణ, రమణ, రాజ, శంకర, రామకృష్ణ, తోటనరసింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags: Dalits Stage Protest as Tahsildar and RI Fail to Show Up