మాజీ మంత్రి పెద్దిరెడ్డి
పుంగనూరుముచ్చట్లు:
కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడిచిన ఒక్క హామి కూడ నేరవేర్చలేదని, సూపర్ -6 ఊసేలేదని , అడిగితే అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారని , ఎవరు అదైర్యపడకండి…భవిష్యత్తు మనదేనని రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. మంగళవారం జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు , మాజీ ఎంపి రెడ్డెప్పతో కలసి ఆయన పట్టణం, మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏటవాకిలి గ్రామంలో సుమారు రూ.1.50 కోట్లతో నిర్మించిన శ్రీ చంద్రమౌలీశ్వరస్వామి, అక్కదేవతల ఆలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాంపల్లెలో మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క హామి కూడ నేరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన తప్పుడు హామిలతో గెలవడం, అధికారంలోకి రాగానే హామిలు విస్మరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దెవ చేశారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి హామిని నేరవేర్చారని స్పష్టం చేశారు. దళారీలకు , అక్రమాలకు చోటు లేకుండ సుమారు 2.37 కోట్ల మందికి నేరుగా వారివారి బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేయడం జరిగిందన్నారు. ఎంతో పారదర్శకమైన పరిపాలన సాగించి, క్యాలెండర్‌ను విడుదల చేసి, పరిపాలన , సంక్షేమ పథకాలు అమలు చేసి , చరిత్ర సృష్టించిన ఏకైక వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమైందని, ఎన్నికలు ఎప్పుడు పెట్టిన వైఎస్సార్‌సిపిని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, జింకా వెంకటాచలపతి, వైఎస్సార్‌సిపి జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, జిల్లా బిసి సెల్ కార్యదర్శి వెంకట్రమణ, మండల పార్టీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సిపి జిల్లా ట్రేడ్‌యూనియన్ కార్యదర్శి జయరామిరెడ్డి, నాయకులు నాగేంద్ర, బాబు, రామమోహన్‌రెడ్డి, రాజారెడ్డి, శంకరప్ప, రెడ్డెప్ప, నంజుండప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags; Do not lose heart… the future is ours.