పరిస్థితి విషమం .
మదనపల్లె ముచ్చట్లు:
భవన నిర్మాణంలో సెల్లార్ కు కాంక్రీటు వేసే క్రమంలో మట్టి చరియలు విరగడం తో కాంక్రీటు మిల్లర్ మీదపడడం తో మిల్లర్ ఆపరేటర్ ఎడమ చేయి తెగి కిందపడిపోయింది. ఈ సంఘటన సోమవారం మదనపల్లె లో చోటు చేసుకుంది. పట్టణంలోని గొల్లపల్లెకు చెందిన రమేష్ కుమారుడు పవన్ కల్యాణ్ కాంక్రీటు మిల్లర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక ఎమ్ఎల్ఎల్ ఆస్పత్రి సమీపంలో సెల్లార్ నిర్మాణంలో భాగంగా పిల్లర్ కాంక్రీటు పనులు చేస్తున్నారు. ఇంజనీర్ వైఫల్యమో, నాసిరకం పనులో మిల్లర్
బరువుకు మట్టిదిమ్మెలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో మిల్లర్ ఒరిగిపోయి గునాదులు తీసిన లోయలో మోల్డింగ్ కమ్మీలపై పడిపోయింది. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ ఎడమచేయి పిల్లర్ ఇనుపరాడ్లలోకి దూరిపోవడంతో మోచేయి తెగిపోయి కమ్మీల్లో ఇరుక్కుపోయింది. గమనించిన సహచర కార్మికులు పవన్ ను హుటాహుటిన ఆటోలో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు.అయితే అధిక రక్తస్రావమై పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. అనంతరం కార్మికులు ఇనుప రాడ్లలో ఇరుక్కుపోయిన చేయి భాగాన్ని బయటకు తీశారు. డాక్టర్ల సలహా మేరకు ఆ భాగాన్ని ఐస్ బాక్స్ లో ఉంచి బెంగళూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న కార్మికుడి కుటుంబీకులు అస్పత్రికి చేరుకుని బోరున విలపించారు.
అధికారుల పర్యవేక్షణ లోపం, ఇంజనీర్ వైఫల్యం, మేస్త్రీ నిర్లక్ష్యం ఓ యువకుడిని అవిటివాడిని చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Tags; A worker’s arm was severed after a concrete mixer fell on him.