May 26, 2026
Explore
“పాతకాలం వారు రాగి పాత్రలో నీరు ఎందుకు తాగేవారు?”

“పాతకాలం వారు రాగి పాత్రలో నీరు ఎందుకు తాగేవారు?”

May 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈరోజుల్లో మనం నీళ్లు తాగాలంటే…ROలు, వాటర్ ప్యూరిఫైయర్లు, ఫ్రిజ్‌లు వాడుతున్నాం

కానీ ఆశ్చర్యం ఏమిటంటే…
వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఒక సహజ Water Purifier ను ఉపయోగించేవారు
అదే రాగి పాత్ర.

అప్పట్లో దాదాపు ప్రతి ఇంట్లో ఒక రాగి బిందె తప్పకుండా ఉండేది.
రాత్రి అందులో నీళ్లు నింపి ఉంచి…
ఉదయం ఆ నీటిని తాగేవారు

ఎందుకంటే రాగిలో నీటిని పరిశుభ్రంగా ఉంచే సహజ గుణాలు ఉన్నాయని మన పెద్దలు గమనించారు

ఈరోజు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు…రాగి (Copper) లో Antimicrobial Properties అనే ప్రత్యేక గుణాలు ఉంటాyi.

అంటే కొన్ని రకాల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు రాగి మీద ఎక్కువసేపు బ్రతకlevu

అది ఎలా పనిచేస్తుంది అంటే

రాగి పాత్రలో నీళ్లు కొన్ని గంటలు ఉంటే…రాగి నుంచి చాలా స్వల్పంగా Copper particles నీటిలో కలుస్తాయి.ఆ Copper particles కొన్ని సూక్ష్మక్రిముల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రంతా పెట్టి ఉంచుతాము కాబట్టి దాదాపు మనకు హాని చేసే బ్యాక్టీరియా నీటిలోనే చనిపోతుంది. అలా సహజ వాటర్ ప్యూరిఫైయర్ గా రాగి పనిచేస్తుంది.

Tags; Why did people in the olden days drink water from copper vessels?