March 20, 2026
Explore
వాణిజ్య కార్యకలాపాల పెరుగుదల నేపథ్యంలో పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలి….

వాణిజ్య కార్యకలాపాల పెరుగుదల నేపథ్యంలో పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలి….

March 20, 2026 | Andhra Pradesh

జీఎస్టీ బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి…

ఆదాయాన్ని అందించే శాఖలు రాష్ట్ర జీఎస్టీ శాఖతో సమన్వయంతో పనిచేయాలి…..

…..జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి ముచ్చట్లు:

రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ అందించే శాఖలు రెవిన్యూ ఆదాయ లక్ష్యాలను అధిగమించాలని, వాణిజ్య కార్యకలాపాలు, వస్తువుల మరియు సేవల వినియోగంపై జిఎస్టి వసూళ్లు పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలో రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని అందించే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు,రవాణా శాఖ, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ శాఖ, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖ లకు ఆదాయ వనరుల పెంపుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ కలెక్టర్ కె ఆర్ ఆర్ సి చంద్రశేఖర్ రెడ్డి తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
ప్రస్తుతం పంచాయతీ పరిధిలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో, గృహ పన్నుల కంటే వాణిజ్య సంస్థల నుంచి సరైన పన్నుల వసూళ్లు జరగడం అత్యంత అవసరమని సూచించారు. ముఖ్యంగా మున్సిపాలిటీ, పంచాయితీ పరిధి వెలుపల ఉన్న పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర వాణిజ్య సంస్థలపై దృష్టి సారించి,తగిన విధంగా ప్రోపోర్షనల్ టాక్స్ వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పన్ను వసూళ్లలో ఏవైనా లోపాలను ఉన్నట్లు గుర్తిస్తే వాటిని వెంటనే సరిచేసే చర్యలు చేపట్టాలన్నారు. జిఎస్టి నంబర్ల ఆధారంగా వ్యాపార లావాదేవీలను పరిశీలించి, నాన్-జెన్యూన్ రిటర్న్ ఫైలర్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాలకు సంబంధించి ప్రత్యేక మానిటరింగ్ విభాగాన్ని
ఏర్పాటు చేసుకొని రోజువారీ పురోగతిని సమీక్షించాలన్నారు. అన్ని శాఖల నుంచి ప్రతి వారం బిల్లుల ప్రాసెసింగ్‌కు సంబంధించిన సమాచారం సేకరించి, కమర్షియల్ టాక్స్ శాఖతో పంచుకోవాలని,సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంపొందించి, సమాచార మార్పిడిని బలోపేతం చేయాలని ఏ శాఖ నుంచి సహకారం లోపించినా, వెంటనే మానిటరింగ్ విభాగానికి తెలియజేసి లక్ష్యాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యాచరణ అంశాలపై అన్ని శాఖలు సమగ్ర నివేదికను సిద్ధం చేసి త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో పన్నుల వసూళ్లలో పారదర్శకత, సమర్థతను పెంపొందించడంతో పాటు ఆదాయ వృద్ధి సాధించడం లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మైన్స్ తదితర ఆదాయ వనరుల శాఖలు తమ లావాదేవీలను క్రమబద్ధంగా నమోదు చేసి పన్ను చెల్లింపులను నిర్ధారించి ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు.

జీఎస్టీ వసూళ్ల పై పెండింగ్ లో బకాయిలు, కేసుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టర్లు నుండి రావలసిన వసూళ్లకు సంబంధించిన వివరాలను వివిధ శాఖల అధికారులు జీఎస్టీ శాఖ అధికారులకు అందజేసి సమన్వయంతో కలిసి పనిచేసి జీఎస్టీ వసూళ్ల పై పెండింగ్ జీఎస్టీ బకాయాలను సమీక్షించుకొని వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పై అవగాహన పెంచి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటూ రెవెన్యూ ఆదాయ శాఖల్లో వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, లక్ష్య సాధనలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా కట్టుదిట్టంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఎక్సైజ్ శాఖ , రవాణా శాఖ , జీఎస్టీ , డిపిఓ, బిఎస్డబ్ల్యుఓ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మైనింగ్, అటవీ శాఖ, మదనపల్లి, పుంగనూరు, బి.కొత్తకోట మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: In light of the increase in commercial activities, tax collection must be carried out rigorously.