March 20, 2026
Explore
21న రంజాన్‌ పండుగకు ఏర్పాట్లు

21న రంజాన్‌ పండుగకు ఏర్పాట్లు

March 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లింలు శనివారం రంజాన్‌ పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ అన్సర్‌బాషా తో పాటు అంజుమన్‌ కమిటి ప్రతినిదులు ఇబ్రహిం, జాఫర్‌, మౌలనాఫజులుల్లా, జబివుల్లా, ఇస్మయిల్‌, ఆరీఫ్‌ తదితరులు ఈద్గాప్రాంతాన్ని సందర్శించారు. పట్టణంలోని ముస్లింలు ర్యాలీగా ఉదయం 8 గంటలకు ఈద్గాప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు నిర్వహిస్తారు. వేలాది మంది ముస్లింలు ఈద్గా ప్రాంతంలో ప్రార్థనలు నిర్వహించి, అక్కడే ఉన్న స్మశాన వాటికలో మృతి చెందిన తమ కుటుంబ సభ్యులకు నివాళులర్పించడం ఆనవాయితీ. ఈ మేరకు ఏర్పాట్లను సీఐ పరిశీలించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేట, తోపుమఠంలో గల ఎంఎం ఈద్గా మైదానం వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు.

Tags: Arrangements for the Ramadan festival on the 21st.