పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్‌సిపి రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎంపిపి భాస్కర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఎమ్మెల్యే తొలుత నల్లగుట్లపల్లెతాండలో చెంగప్పనాయక్ ఇంటికి వెళ్తారు. రాంపల్లెలో వెంకట్రమణ ఇంటికి , ఉలవలదిన్నెలో కె.వెంకట్రమణ ఇంటికి, మంగళంలో బాబు ఇంటికి , పట్టణంలో రామచంద్ర ఇంటికి, అలాగే తాటిమాకులపాళెంలో నీలీమ ఇంటికి వెళ్తారు. అలాగే ఏటవాకిలిలో చంద్రమౌలీశ్వరస్వామి ఆలయానికి చేరుకుని, జౌకొత్తూరులో జి.వెంకట్రమణ ఇంటికి వెళ్తారని తెలిపారు. ఎమ్మెల్యే పర్యటనలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags: MLA Peddireddy’s Tour on the 26th