— విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని )
— పూర్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన ఎంపీ శివనాధ్
విజయవాడ ముచ్చట్లు:
ఏబీఎన్ జర్నలిస్టు పూర్ణ మృతి బాధాకరమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని ) అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరో సీనియర్ రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు ( ఏబీఎన్ పూర్ణ ) భౌతికకాయాన్ని శుక్రవారం పడమటలంకలో ఎంపీ శివనాథ్ (చిన్ని )సందర్శించి పూలమాలేసి నివాళులర్పించారు పూర్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా…ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని ) మాట్లాడుతూ…జర్నలిజంపై అత్యంత ఇష్టంతో పనిచేసిన జర్నలిస్టు ఏబీఎన్ పూర్ణ అని అన్నారు. వర్తమాన రాజకీయాలపై సంపూర్ణ అవగాహనతో పూర్ణ ఉండేవారని, ఓ జర్నలిస్ట్ గా క్షేత్రస్థాయిలో అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారన్నారు. అటువంటి జర్నలిస్ట్ ఏబీఎన్ పూర్ణ చిన్న వయసులోనే మృతి చెందటం బాధాకరం అని ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని ) అన్నారు.
Tags: The passing of ABN Poorna is deeply saddening.