May 25, 2026
Explore
ఏనుగుల బారీ నుండి పంటలతోపాటు రక్షణ కల్పించాలి

ఏనుగుల బారీ నుండి పంటలతోపాటు రక్షణ కల్పించాలి

May 25, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

ఏనుగుల బారీ నుండి పంటలతోపాటు.రైతులకు పూర్తి రక్షణ కల్పించాలని జిల్లా రైతు నాయకులు ఉమాపతి నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.చిత్తూరు జిల్లాలో చాలా మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్న సందర్భంలో అటవి సమీపాన గల అనేక ప్రాంతాల్లో ఏళ్ళ తరబడి ఏనుగుల సమస్యల వలన జరిగే పంటా ప్రాణ నష్టాలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం కొండంత నష్టానికి గోరంత పరిహారం.ఈ పరిహారం ఎక్కడికి సరిపోదని ప్రస్తుతం రైతులు పంట పెట్టుబడులకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి వేసిన పంటపై ఒకవైపు ఏనుగులు మరోవైపు అడవి పందులు వీటికి తోడు వేలల్లో కోతుల బెడదలతో రైతులు సతమతమౌతున్నారని తెలిపారు.ఈ ఏనుగులు పంటలను నష్టపరచడమే కాకుండా గ్రామాలపై కూడా చొరబడి మూగజీవాలను సైతం లెక్కచేయక చంపేస్తున్నాయని వీటిని తరిమెందుకు ప్రయత్నిస్తున్న అటవి శాఖ అధికారులను ట్రాకర్స్ లను రైతులపై కూడా అతి క్రూరంగా తిరగబడి ఇప్పటికీ ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాయని మరికొందరు బలమైన గాయాలతో ఆసుపత్రులలో చేరి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.

ఇలాంట సంఘటనలు ఏళ్ళ తరబడి జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు గాని ప్రజా పాలకులు గానీ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయని తెలిపారు.ఏనుగులవలనఒకవైపు వైపు పంట నష్టాలు.మరోవైపు ప్రాణనష్టాలు జరుగుతున్నాయని వీటి పోరుకు బయపడి కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యవసాయమే మాకు వద్దని బీడు భూములుగా వదిలేస్తున్నారని చెప్పారు.ఏనుగులు పంటపొలాలపై రాకుండా వాటిపై దృష్టి పెట్టి శాశ్వత రక్షణ చర్యల తీసుకుని అటవి సమీపాన గల ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి నష్టాలు జరిగేవీ కాదని ఆయన అన్నారు.ఎలాంటి ఫెన్సింగ్ వంటివి చేయకుండా.కుంకి ఏనుగుల ప్రాజెక్టు కొరకు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు.దీనివలన రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని ప్రజలు రైతులు వాపోతున్నారని తెలిపారు.ఏనుగుల వలన జరిగే పంటా ప్రాణ నష్టాలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం అంతంత మాత్రమే.లక్షల్లో పంటలు నష్టపోతే పంట నష్టానికి తగిన పరిహారం మాత్రం తగినంత పరిహారం ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారని.

ప్రస్తుతం ఇస్తున్న పరిహారం ఎక్కడికి సరిపోదని.మేము ఇస్తున్నామని ఏదో కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున పరిహారాన్ని మూడింతలు పెంచి ఇస్తే కూడా ఎక్కడికి చాలదన్నారు.ప్రస్తుత పంటపెట్టుబడులు. కూలీలు బారీగా పెరిగాయి వీటికి అనుగుణంగా ప్రస్తుత పంటలవారీగా మార్కెట్ రేటు ప్రకారం పంట నష్టమైన రైతులకు పంట నష్టపరిహారం మూడింతలపైన పెంచి ఇస్తే పెట్టిన పెట్టుబడులకైనా వస్తుందని రైతులు భావిస్తున్నారని చెప్పారు. పంట నష్టాలకు ప్రభుత్వం ఇస్తున్న లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే డబ్బులను అటవి సమీపాన గల ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు ఇద్దరు ముగ్గురు కలిసి తమ పొలాలకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కొరకు అటవీశాఖ అధికారుల ఆమోదంతో వంద శాతం పూర్తి సబ్సిడీతో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తే పంటపొలాలపై ఏనుగులతో పాటు అడవి పందులు కూడా కొంత వరకు నివారించవచ్చునని అన్నారు.అదేవిధంగా పంటనష్టాలతోపాటు ప్రాణ నష్టాలను కూడా కొంత వరకు నివారించవచ్చునని తెలిపారు.పంటనష్టాలకు ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహార భారాన్ని కూడా చాలా వరకు తగ్గుతుందని రైతులకు ఇచ్చే నష్టపరిహారం డబ్బులను సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వలన రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎంతో మేలు కల్పించే విధంగా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రభుత్వానికి శాశ్వతంగా మంచి పేరు ఉంటుందని.రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమాపతి నాయుడు.ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:Protection must be provided for crops—as well as for people—against the threat posed by elephants.