సోమలముచ్చట్లు:
సోమల మండలం గురికానివారిపల్లెలో వైఎస్సార్‌సిపి నాయకుడు శంకరయ్య కుమారుడు రాజశేఖర్ (31 ) ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే సోమవారం తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి , నియోజకవర్గ యువనాయకుడు సుధీర్‌రెడ్డి లు గ్రామానికి చేరుకుని రాజశేఖర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్‌లో శంకరయ్యను పరామర్శించి, కుటుంభానికి అండగా ఉంటామని, దైర్యంగా ఉండాలని కోరారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సిపి నాయకులు ప్రభాకర్, నాగేశ్వరరావు, నాగభూషణ్‌రెడ్డి, శీలం భాస్కర్, ఝాన్సీలక్ష్మీ, జిన్న, పుష్పావతి, కయూంబాషా, మహేష్, సరస్వతి తదితరులు ఉన్నారు.


Tags: We will stand by Shankarayya’s family.