May 25, 2026
Explore
ఇవాళ రాత్రి 8:24 గంటలకు.. రోహిణి కార్తె ఆరంభం

ఇవాళ రాత్రి 8:24 గంటలకు.. రోహిణి కార్తె ఆరంభం

May 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రోహిణి కార్తె ఈరోజు రాత్రి 8:24 గంటలకు ప్రారంభం కానుందని పంచాంగం చెబుతోంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. ఈ సమయంలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, ‘రోహిణిలో రోళ్లు పగులుతాయి’ అని పెద్దలు అంటుంటారు. ఈ కార్తె ముగిసిన తర్వాత జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. ఆ సమయంలో నైరుతి రుతుపవనాలు విస్తరించి, వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడుతుంది.

Tags: Tonight at 8:24 PM, the Rohini Karte begins.