పుంగనూరుముచ్చట్లు:
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ తెలిపారు. ఆదివారం కార్యదర్శి మున్నతో కలసి కరపత్రాలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ జూన్ నెల 6 నుంచి శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యారంగ సమస్యలు, విద్యారంగంలో కార్పోరేటీకరణ , ఫీజురియంబర్స్మెంట్ లాంటి పలు విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు శిక్షణకు తప్పకుండ హాజరై , ఏఐఎస్‌ఎఫ్‌ను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రదీప్, నవీన్, సుహేల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: AISF District-Level Training Classes