పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందును నిషేధించడం జరిగిందని , రైతులు దీనిని వినియోగించరాదని ఏడి శివకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాదేశాల మేరకు పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపును నివారించే మందును 60 రోజుల పాటు నిషేధిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని మందుల షాపుల్లో ఉన్న 2481 లీటర్ల మందును విక్రయించకుండ నిషేధిస్తూ సంబంధిత డీలర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనిపై ఎలాంటి క్రయవిక్రయాలు నిర్వహించిన డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags: The herbicide Paraquat Dichloride has been banned.