అమెరికా ముచ్చట్లు:
వాషింగ్టన్లోని అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్హౌస్ వద్ద కాల్పులు కలకలం రేపాయి.అధ్యక్షుడు ట్రంప్ భవనంలో ఉండగానే బయట దుండగులు 20-30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురుకాల్పులు జరపడంతో ఒక నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో వ్యక్తికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో వైట్హౌస్ వద్ద భద్రతను అత్యంత కఠినతరం చేశారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది.
Tags; Shooting Scare at the White House