తిరుమల ముచ్చట్లు:
గుంటూరుకు చెందిన మాదాల శేషగిరిరావు అనే భక్తుడు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.అదేవిధంగా గుంటూరుకు చెందిన వడ్లమూడి మిత్రేష్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,111 విరాళంగా అందించారు.ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు విరాళం డీడీలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

Tags: Donation of ₹20 Lakhs to TTD